దివాలా కోరుతనానికి బాబు చిరునామా: కేటీఆర్ | TRS MLA K. T. Rama Rao fire on Telugu Desam Party president Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

దివాలా కోరుతనానికి బాబు చిరునామా: కేటీఆర్

Published Tue, Nov 5 2013 11:53 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

దివాలా కోరుతనానికి బాబు చిరునామా: కేటీఆర్ - Sakshi

దివాలా కోరుతనానికి బాబు చిరునామా: కేటీఆర్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ... రాజకీయ దివాలా కొరుతనానికి చంద్రబాబు నాయుడు చిరునామా అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబుకు ఓ విధానమంటూ లేకుండా గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు.

 

అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసి... ఇప్పడు తానే వెళ్లనంటున్న చంద్రబాబు నాయుడు వైఖరిని కేటీఆర్ ఈ సందర్భంగా తప్పుపట్టారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీ అధ్యక్షులే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ అనుసరిస్తున్న విధి విధానాల పట్ల కేటీఆర్ ఆసంతృప్తి వ్యక్తం చేశారు.

 

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి 10 నిమిషాలపాటు దోషాలు లేకుండా తెలుగులో మాట్లాడాలి. ఆయన అలా మాట్లాడితే రూ.10 లక్షలు ఇస్తానని కేటీఆర్ ఈ సందర్బంగా సీఎంకి నజరానాతో కూడిన సవాల్ విసిరారు.  హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ దందాగా మారిందని ఆరోపించారు. ఆ ప్రాజెక్ట్లో వివాదాలు ఉన్న చోట మెట్రో పనులు నిలిపివేయాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement