సీఎంపై గవర్నర్‌కు టీఆర్ఎస్ ఫిర్యాదు | TRS MLAs Complaint Against CM Kiran kumar Reddy to Governor ESL Narasimhan | Sakshi
Sakshi News home page

సీఎంపై గవర్నర్‌కు టీఆర్ఎస్ ఫిర్యాదు

Published Thu, Aug 8 2013 5:03 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

సీఎంపై గవర్నర్‌కు టీఆర్ఎస్ ఫిర్యాదు - Sakshi

సీఎంపై గవర్నర్‌కు టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిశారు. తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై జరుగుతున్న కుట్రల గురించి గవర్నర్‌కు వారు తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్రెడ్డిపై కూడా ఫిర్యాదు చేశారు.

కేసీఆర్కు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని గవర్నర్కు తెలిపామని టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ తెలిపారు. కేసీఆర్కు  భద్రత పెంచాలని కోరామన్నారు. తెలంగాణపై కిరణ్ సర్కారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, జోక్యం చేసుకోవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.

డీజీపీ పదవికి దినేష్రెడ్డి అనర్హుడని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, రాజయ్య అన్నారు. డీజీపీని కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement