సాక్షి, తిరుమల : తిరుమలలో కరోనా వైరస్ నియంత్రణకు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ ఆదేశాల మేరకు అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి పర్యవేక్షణలో అన్ని విభాగాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మంగళవారం తెల్లవారుజాము నుంచి టైంస్లాట్ టోకెన్లు జారీ చేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్– 1, 2లో వేచి ఉండకుండా టీటీడీ చర్యలు చేపట్టి నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోంది. (చదవండి: కరోనా అప్‌డేట్ : 7400 దాటిన మృతుల సంఖ్య)
కల్యాణ కట్ట
తిరుమలలోని ప్రధాన కల్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాల్లోని 9 మినీ కల్యాణ కట్టల్లో భక్తులు వేచి ఉండకుండా అధికారులు ఏర్పాటు చేశారు. సత్వరం తలనీలాలు సమర్పించేలా చర్యలు తీసుకున్నారు. కల్యాణ కట్టల్లోని క్షురకులకు మాస్కులు, డెటాల్, సొల్యూషన్ అందించారు. ప్రతి 2 గంటలకోసారి పరిశుభ్రత(శానిటైజ్) చర్యలు చేపట్టారు. ప్రధాన కల్యాణ కట్టలో ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. (కోవిడ్-19 నిరోధక చర్యలపై బులెటిన్ విడుదల)
వసతి విభాగం
తిరుమలలోని వసతి గృహలు, అతిథి భవనాలు, వసతి సమూదాయాల్లో (పీఏసీలు) అదనపు సిబ్బందిని ఏర్పాటుచేసి శుభ్రం చేస్తున్నారు. వసతి గదులు భక్తులు ఖాళీ చేసిన తరువాత ఒక గంట పాటు సరైన విధంగా శుభ్రం చేసిన తరువాత మరొకరికి కేటాయిస్తున్నారు. (‘కరోనా ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయండి’)
ఆరోగ్య విభాగం
టీటీడీ ఆరోగ్య విభాగాధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి ఆధ్వ ర్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో శానిటైజర్లు, ప్రతి రెండు గంటలకు ఒకసారి క్రిమిసంహాకరక మందులతో పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య సామగ్రిని అందిస్తున్నారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుమలలో విధులు నిర్వహించే ఉద్యోగులందరికీ మాసు్కలు, శానిటైజర్లు అందించారు. అలిపిరి చెక్‌పాయింట్ నుంచి తిరుమలకు వచ్చే వాహనాలపై అంటువ్యాధి నివారణ మందులను పిచికారీ చేస్తున్నారు. తిరుమలలోని ఆరోగ్య విభాగం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పనిచేస్తుంది. యాత్రికులు 0877–2263447 నంబరుకు ఫోన్ చేసి కరోనా వ్యాప్తి నివారణ చర్యలను తెలుసునేలా చర్యలు చేట్టారు.
వైద్య విభాగం
అలిపిరి చెక్ పాయింట్, అలిపిరి నడక మార్గంలోని పాదాల మండపం, శ్రీవారి మెట్టు నడక మార్గం వద్ద కరోనా వ్యాప్తి నివారణ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. మందులు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. ప్రాథమికంగా వైరస్ లక్షణాలను గుర్తిస్తే తిరుమలకు అనుమతించకుండా రుయా ఆçస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు పంపుతున్నారు.
(కరోనా భయం: స్వీయ నిర్బంధంలో ప్రియదర్శి!)
అన్నప్రసాదం
తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఒక్కో హాలులో 1000 మంది భోజనం చేసే అవకాశం ఉంది. అయితే 500 మందిని మాత్రమే కూర్చోబెట్టి భోజనం అందిస్తున్నారు. ఒక టేబుల్‌కు నలుగురు కూర్చునే అవకాశం ఉన్నా, ఇద్దరిని మాత్రమే క్చూబెట్టి అన్నప్రసాదం వడ్డిస్తున్నారు. ఉద్యోగులు అందరూ మాస్కులు ధరించి, శానిటైజర్లతో చేతులను ఏప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటున్నారు. తిరుమలలోని వివిధ కౌంటర్లలోను మాస్కు లు ధరించి అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.
దర్శన తేదీలను మార్చుకునే అవకాశం
తిరుమల శ్రీవారి దర్శనానికి మే నెల 31వ తేదీ వరకు ముందస్తుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందిన భక్తులకు తమ దర్శన తేదీలు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. రద్దు చేసుకుంటే నగదు తిరిగి పొందే సౌకర్యాన్ని కల్పించారు. భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు విశేష పూజ, సహస్ర కలశాభిõÙకం, వసంతోత్సవం వంటి ఆర్జీత సేవలను రద్దు చేశారు.
చదవండి: అలా ఆ దేశాలు కరోనా వ్యాప్తిని అరికట్టాయి..
విస్తృత ప్రచారం
కరోనా వ్యాప్తి నివారణకు భక్తుల్లో అవగాహన కలి్పంచేందుకు శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్, రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్ విభాగాల ద్వారా తిరుమలలోని ముఖ్య కూడళ్లలోనూ, రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో నిరంతరాయంగా ప్రచారం చేస్తున్నారు.
క్యూలు పరిశీలించిన అదనపు ఈఓ
తిరుమల : శ్రీవారి దర్శనానికి టైంస్లాట్ టోకెన్లు పొందిన భక్తుల క్యూలను మంగళవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు టీటీడీ విస్తృత చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలలో థర్మల్ స్క్రీనింగ్, అలిపిరి చెక్‌పాయింట్ నుంచి తిరుమలకు వచ్చే వాహనాలపై శానిటైజ్ చేస్తున్నామన్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు గంటకు 4 వేల టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. తద్వారా భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్– 1, 2లో వేచి ఉండకుండా నేరుగా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. క్యూలను ప్రతి రెండు గంటలకొకసారి మందులతో శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆలయం, కళ్యాణకట్ట, అన్నప్రసాద భవనం, వసతి గృహలు, అతిథి భవనాలు, పీఏసీ తదితర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాధ్, వీజీఓ మనోహర్ పాల్గొన్నారు.
చదవండి: ఫోర్డ్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
బోసిపోయిన వేసవి విడిది
బి.కొత్తకోట: మండలంలోని ప్రముఖ వేస వి విడిది కేంద్రం హార్సిలీహిల్స్‌పై కరోనా ప్రభావం పడింది. ఈ సమయానికి కొండపై రద్దీ అధికంగా ఉండాలి. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సేద తీరి వెళుతుంటారు. సుదూర ప్రాంత సందర్శకుల నిత్యం రద్దీ ఉంటుంది. అయితే ప్రస్తుతం కరోనా వ్యాధిపై ప్రజలు భయకంపితుల వుతుండడంతో ఈ ప్రభావం కొండపై చూ పుతోంది. మంగళవారం కొండపై చూసేందుకైనా ఒక్కరూ లేరు. కొండకు వచ్చే సందర్శకుల్లో అత్యధిక భాగం బెంగళూరుదే. కర్ణాటకలోని ఈ నగరంపై కరోనా ప్రభా వం పడడం, ప్రభుత్వం పలు ఆంక్షలు వి ధించడంతో ప్రయాణాలు చేసే పర్యాటకు లు నగరం విడిచి రావడం లేదు. ఎక్కడి ప్ర జలు అక్కడే ఉండిపోతున్న కారణంగా కొండకు సందర్శకుల రాక పూర్తిగా నిలిచిపోయింది. బెంగళూరు తర్వాత తమిళనాడు సందర్శకులు అధికసంఖ్యలో వస్తుంటారు. వీరుకూడా కొండకు రావడం లేదు. టూరిజం గదులను ముందుగానే బుక్ చేసుకుని ఇక్కడ విడిది చేసి వెళుతుంటారు. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు రాకపోవడంతో కొండకు భారీగా నష్టం వాటిల్లుతోంది.
Comments
Please login to add a commentAdd a comment