అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలంలో నీటి గుంటలో పడి ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. మండలంలోని నారాయణపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8తరగతి చదువుతున్న వాణి, 6 తరగతి చదువుతున్న హర్షిత ఇద్దరూ కుర్లపల్లి గ్రామానికి చెందిన వారు.
రోజు పాఠశాలకు కాలినడకన వెళ్లి వస్తుంటారు. సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా నీరు తాగేందుకు సమీపంలోనే ఉన్న వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లారు. పక్కనే రోడ్డు కోసం మట్టిని తోడగా.. ఆ గుంటలో నీరు నిలిచింది. నీరు తాగే క్రమంలో హర్షిత కాలు జారి గుంతలో పడిపోయింది.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన వాణి కూడా గుంటలో పడిపోయింది.
దీంతో తోటి విద్యార్థులు కేకలు వేయగా.. అటుగా పోతున్న బాటసారులు విద్యార్థినులను బయటకు తీశారు. అయితే అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు.