
ఉదయ్ కిరణ్
హైదరాబాద్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సినీహీరో ఉదయ్ కిరణ్ తాను అప్పు ఇచ్చిన ఎటువంటి హామీ పత్రాలపైన సంతకం చేయలేదని ఫైనాన్షియర్ సంగీత స్పష్టం చేశారు. డిసెంబర్‌లో చివరలో ఉదయ్‌ని కలిసినట్లు ఆమె చెప్పారు. ఉదయ్ కిరణ్ మాజీ మేనేజర్, ప్రస్తుతం నిర్మాతగా మారిన మున్నా ఆఫీసు మూసేయడంతో ఉదయ్య దగ్గరకు వెళ్లినట్లు ఆమె తెలిపారు.
వడ్డీ కట్టలేక తానే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు ఆమె చెప్పారు. ఇప్పటి వరకు ఉదయ్ ఇంటికి తాను రెండుసార్లే వెళ్లినట్లు సంగీత తెలిపారు.