
అనంతపురం టౌన్: అనంతపురంలో ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం కొత్తపల్లికి చెందిన సుబ్బారెడ్డి (24) డిగ్రీ వరకు చదువుకున్నాడు. మూడు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడా ఉద్యోగం దొరక్కలేదని మనోవేదనకు లోనయ్యాడు. ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రికి వెళుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి వచ్చిన సుబ్బారెడ్డి బుధవారం అనంతపురం రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి వద్ద లభించిన బ్యాగును రైల్వే పోలీసులు పరిశీలించగా.. నైలాన్ వైరు కనిపించింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నట్లు తెలుస్తోంది. సెల్‌నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, పోలీసులు కేసు నమోదు చేశారు.