ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఈ నెల 7న హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీఓలు నిర్వహించతలపెట్టిన సభను అడ్డుకొని తీరుతామని, సభ జరగనివ్వమని ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ స్పష్టం చేశారు. ముల్కి అమరవీరుల వారోత్సవాల ను పురస్కరించుకొని తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో హన్మకొండలోకి కాళోజీ కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధావారం నాటికి మూడో రోజుకు చేరాయి. దీక్షలో కూర్చు న్న టీఎన్జీఓలకు ఎమ్మెల్యే సంఘీబావం తెలిపి మాట్లాడారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు 7వ తేదీన హైదరాబాద్ గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నా అనుమతివ్వని సర్కార్ ఏపీ ఎన్జీఓస్ సభకు ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నించారు. సీఎం కిరణ్ సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని తూర్పారబట్టారు. కేసీఆర్ దీక్ష చేపడితే అడుగడుగునా ఆటంకాలు సృష్టించిన ప్ర భుత్వం సీమాంధ్ర నాయకులు చేస్తున్న దీక్షలకు ఎలాంటి అడ్డంకులు కల్పించడం లేదన్నారు. సీమాంధ్ర యాత్రతో చంద్రబాబు అసలు నైజం బయటపడిందని, ఇప్పటికైనా తెలంగాణకు చెందిన టీడీపీ నాయకులు ఆ పార్టీని వీడి ప్రజా ఉద్యమంలో కలిసిరావాలని కోరారు.
లేక పోతే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. బాబు సమైక్యాంధ్రకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంపై టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. హైదరాబాద్‌తో కూడి న తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వరకూ విశ్రమించేది లేదని చెప్పారు. దీక్షలలో టీఎన్జీఓల యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు కె.రత్న వీరాచారి, జి.రాంకిషన్, ఎ.సదానందం, కె.రత్నాకర్‌రెడ్డి, ఎల్.దాస్యానాయక్, ఎన్.ప్రభాకర్, ఈగ వెంకటేశ్వర్లు, హసన్, పుల్లూరి సుదాకర్, మాదవ రెడ్డి, కత్తి రమేశ్, విజయలక్ష్మి, రాజేందర్, సోమయ్య, లక్ష్మారెడ్డి, డి.శ్రీనివాస్ నాయక్, ధరంసింగ్‌తోపాటు 100 మంది ఉద్యోగులు కూర్చున్నారు.
ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఊరుకోమని, తెలంగాణ భగ్గుమంటుందని అన్నారు. సీమాంధ్రుల పట్ల అప్రమత్తంగా ఉండి కుట్రలు తిప్పి కొడతామని చెప్పారు. టీఎన్జీఓల యూనియ న్ జిల్లా అధ్యక్షుడు కె.రాజేశ్‌కుమార్ మాట్లాడుతూ ముల్కి అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని గురువా రం దీక్షలతోపాటు అదే స్థలంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఇందులో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఎన్జీఓస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విఠల్ పాల్గొంటారని తెలిపారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జగన్‌మోహన్‌రావు మా ట్లాడుతూ పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసయ్యే వరకూ సంబురాలు చేసుకునేది లేదన్నారు. తెలంగాణ బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ తిరునహరి శేషు మాట్లాడుతూ సీమాంధ్ర పెట్టుబడీదారులు, నాయకులు దింపుడు కల్లం ఆశతో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని రోజులు సీమాంధ్రు లు ఉద్యమం చేసిన కేంద్రం నిర్ణయంలో ఈసారి మార్పు ఉండదన్నారు.
‘సమైక్య’ సభను అడ్డుకుంటాం
Published Thu, Sep 5 2013 4:21 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM
Advertisement
Advertisement