బీసీల అభివృద్ధిపై కేంద్రం లోని యూపీ ఏ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: బీసీల అభివృద్ధిపై కేంద్రం లోని యూపీ ఏ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారమిక్కడ బీసీ సంఘం కార్యాలయంలో 36 బీసీ ఉద్యోగుల సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెం బర్ 15న జరిగే బీసీ ఉద్యోగుల చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలపై అనేక పోరాటాలు చేశామని, గత 30 ఏళ్లలో 24 సార్లు ప్రధానమంత్రులతో చర్చలు జరిపినా ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని విమర్శించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 లక్షల 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.