- 250 ఎకరాల్లో దెబ్బతిన్న పంట
- రూ. 1.25 కోట్ల నష్టం
గుర్ర ంకొండ: అగ్గితెగులు సోకడంతో టమాట రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మండలంలోని చెర్లోపల్లె, ఎల్లుట్ల, టి.పసలవాండ్లపల్లె, వుర్రివూకులపల్లె, అమిలేపల్లె, సంగసవుుద్రం, నడిమికండ్రిగ, సరివుడుగు గ్రావూల్లో సుమారు 250 ఎకరాల్లో సీడ్స్ టమాటాకు అగ్గితెగులు, ఆకుముడత తెగులు సోకడంతో రూ. 1.25 కోట్ల మేరకు పంట నష్టం వాటిల్లింది.
పొలం దుక్కులు, నర్సరీల్లో టమాట మొక్కల కొనుగోళ్లు, మొక్కలు నాటిన నెల రోజులకు సీడ్స్ కట్టెల ఏర్పాటు, రసాయనిక, సేంద్రియ ఎరువుల వినియోగం, కూలీల తో కలుపుకుని ఎకరాకు సాగు కోసం రైతులు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. మండలంలో ఈ ప్రాంతాల్లో మాత్రమే అధిక విస్తీర్ణంలో ఈ రకం టమాట సాగు చేస్తారు.
అయితే ఈ ఏడాది గత నె ల రోజులుగా అగ్గితెగులు, ఆకుముడత తెగులు సోకడంతో పంట మొత్తం నాశనమైంది. రైతులు లబోదిబోమంటున్నారు. టమా ట మొక్కలు నాటిన పది రోజుల నుంచే తెగుళ్లు ప్రారంభమయ్యాయి. మందులు పిచికారి చేస్తే సరిపోతుందని భావించిన రైతులు ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. తెగుళ్లు సోకడంతో మొక్కల్లో ఎదుగుదల లేదు. కొన్ని మొక్కల్లో ఎదుగుదల వచ్చినా కాయల్లో సైజు ఉండడం లేదు.
పురుగు మందులు పిచికారీ చేయడానికే వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు రైతులు తెలిపారు. తెగుళ్ల కారణంగా ఆకులు మొత్తం ముడుచుకుపోయి చెట్టు పసుపు రంగులోకి మారిపోతోంది. ఈ తెగుళ్లు పంట మొత్తానికి సోకడంతో రైతులు చేసేది లేక పంట మొత్తం దున్నేస్తున్నారు. దీంతో ఒక్కో రైతుకు ఎకరానికి రూ. 50 వే ల నుంచి రూ. 60 వేల వరకు నష్టం వాటిల్లుతోంది. 250 ఎకరాల్లో పంట దెబ్బతినడంతో దాదాపు రూ. 1.25 కోట్ల నష్టం వచ్చినట్టు రైతులు చెబుతున్నారు.