
సాక్షి, పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దిగ్విజయంగా కొనసాగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం పాలకొల్లు పంచారామ క్షేత్రంలోని క్షీర రామలింగేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, అధికారులు పూర్ణకుంభంతో మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్చకులు బాగుంటేనే దేవాలయాలు బాగుంటాయని అభిప్రాయపడ్డారు. దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జగన్ ఆదేశాల ప్రకారం ప్రతి దేవాలయంలో దూపదీప నైవేద్యాలు అందించాలని, ఆలయాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. అర్చకులకు ఇళ్లు, వేతనాల పైంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. మంత్రి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ డా.సిహెచ్ సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లెం ఆనంద ప్రకాశ్, చిలువూరి కుమార దాత్త్ర్యాయ వర్మ, యడ్ల తాతాజీ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment