
నవ నిర్మాణ దీక్ష- కడప, చిత్తూరులో ఖాళీ కుర్చీలు
సాక్షి, కర్నూల్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నవనిర్మాణ దీక్షలు కేవలం అట్టహాస ఏర్పాట్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. జనాలు లేక దీక్షా ప్రాంగణాలు వెలవెలపోతున్నాయి. దీక్షలో జనాలు లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నేతలు మొక్కుబడిగా దీక్షలో కుర్చీలకు ఉపన్యాసాలు ఇస్తున్నట్లు అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు. అలాగే ఈ దీక్షలు జరుగుతున్న ఇతర జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ప్రజలు లేక ఖాళీ కుర్చీలు నేతలను వెక్కిరిస్తున్నాయి.
గుంటూరు : జిల్లాలోని వట్టిచెరుకూరులో నవనిర్మాణ దీక్షలో ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో పాల్గొని నిరసన తెలియజేశారు. శుక్రవారం రాత్రి మాజీ మంత్రి రావెల కిషోర్ ఆఫీసు వద్ద తహశీల్దార్‌పై జరిగిన దాడికి నిరసనగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నవనిర్మాణ దీక్షలో పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులపైన దాడులు పెరిగిపోతున్నాయని కొంతమంది ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment