చెన్నై, బెంగళూరు వెళ్లేందుకు సాయిరెడ్డికి అనుమతి
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డి చెన్నై, బెంగళూరు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. శనివారం నుంచి నవంబర్ 30 వరకు ఆయన ఆ నగరాలకు వెళ్లి రావచ్చని సీబీఐ రెండో అదనపు కోర్టు జడ్జి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అయితే, హైదరాబాద్ విడిచి వెళ్లడానికి ఒక రోజు ముందు కోర్టుకు, సీబీఐకి సమాచారం ఇవ్వాలని, ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఫోన్‌లో అందుబాటులో ఉండాలని షరతులు విధించారు. ఆడిటర్‌గా తన క్లయింట్లకు సేవలందించేందుకు వీలుగా 30 వరకు చెన్నై, బెంగళూరు వెళ్లేందుకు అనుమతించాలన్న పిటిషన్‌పై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, జగన్ కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి కొల్‌కతా, ఢిల్లీ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. శనివారం నుంచి నవంబర్ 14 వరకు ఆ నగరాలకు వెళ్లేందుకు సీబీఐ రెండో అదనపు కోర్టు జడ్జి అనుమతిచ్చారు.