సాక్షి, విజయవాడ : పౌరసరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో రేషన్ పంపిణీ చేపట్టనున్నట్లు జాయింట్ కలెక్టర్ మాధవీలత తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్క సభ్యునికి అయిదు కిలోల ఉచిత బియ్యం ఇస్తామని తెలిపారు. అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు 35 కిలోల ఉచిత బియ్యం సరఫరా చేస్తామన్నారు. అన్నపూర్ణ కార్డు దారులకు పదికిలోల ఉచిత బియ్యం, ప్రతీ కార్డుకి కిలో శనగపప్పు ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ నెల 14 న డీలర్లు గోడౌన్ల నుంచి స్టాక్ తీసుకెళ్లాలని, బయో మెట్రిక్ ద్వారా సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. రేషన్ షాపుల వద్ద శానిటైజర్లు ,సబ్బు ,నీళ్లు ఉంచాలని, లబ్ధిదారులు మార్కింగ్ చేసిన చోట నిలబడి భౌతిక దూరం పాటించాలని సూచించారు. వినియోగదారులు తప్పనిసరిగా మాస్కులు కాని రుమాలు కానీ ధరించాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. (భారత్‌లో కరోనా : 52,952 కేసులు, 1,783 మంది మృతి )
Comments
Please login to add a commentAdd a comment