వణుకుతున్న విశాఖ ఏజెన్సీ | Vizag Agency shivers at 7 degrees Celsius | Sakshi
Sakshi News home page

వణుకుతున్న విశాఖ ఏజెన్సీ

Published Thu, Dec 5 2013 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM

వణుకుతున్న విశాఖ ఏజెన్సీ

వణుకుతున్న విశాఖ ఏజెన్సీ

పాడేరు రూరల్/చింతపల్లి(విశాఖ జిల్లా), న్యూస్‌లైన్: విశాఖ ఏజెన్సీని చలి వణికించేస్తోంది. ఈ మధ్య వరకూ అల్పపీడనం, తుపాను ప్రభావంతో అంతగా ప్రభావం చూపని చలిగాలులు మంగళవారం రాత్రి నుంచి విజృంభించాయి. బుధవారం ఏజెన్సీ పాడేరు ఘాట్‌లోని అమ్మవారి పాదాలు వద్ద 7 డిగ్రీలు, లంబసింగిలో 9, మినుములూరులో 10, చింతపల్లిలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
 
 జనవరి నెలాఖరుకు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పడతాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ప్రదీప్‌కుమార్ తెలిపారు. మన్యంలో పరిస్థితి దయనీయంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. చిన్నపాటి వర్షం మాదిరి మంచు పడుతోంది. ఉదయం 9 గంటలు దాటితే గానీ ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement