జిల్లా ఓటర్లు.. 2496622
- పురుషులు 1249531..మహిళలు 1246906
- వరంగల్ పశ్చిమలో ఎక్కువ.. పరకాలలో తక్కువ
- తుదిజాబితా విడుదల చేసిన కలెక్టర్
- నేటి నుంచి మళ్లీ నమోదుకు అవకాశం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ శుక్రవారం ప్రకటించారు. తుది జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 24,96,622 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 12,49,531 కాగా.. మహిళలు 12,46,906 మంది ఉన్నారు. వీరితో పాటు ‘ఇతరులు’ కేటగిరీలో 185 మంది నమోదయ్యారు. 1-1-2014 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండినవారందరికీ జాబితాలో చోటు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానించిన అధికారులకు.. ముసాయిదా జాబితా ప్రకటన తరువాత 1.50 లక్షలవరకు నమోదు, చేర్పులు, మార్పులు, తొలగింపునకు దరఖాస్తులు అందాయి.
ఆన్‌లైన్ ద్వారా, నేరుగా దరఖాస్తులు స్వీకరించిన అధికారులు అర్హులందరికీ జాబితాలో చోటు కల్పించారు. శుక్రవారం తుది జాబితా ప్రకటన తరువాత ఫిబ్రవరి ఒకటి నుంచి ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల కోసం మళ్లీ ఆన్‌లైన్‌ద్వారా, నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం జాబితాలో పేర్లున్న అందరూ ఆన్‌లైన్‌ద్వారా ఓటరు గుర్తింపు కార్డులు పొందవచ్చు. అయితే నవంబర్‌లో ప్రకటించిన ముసాయిదా కన్నా.. శుక్రవారం ప్రకటించిన తుది జాబితాలో 19,731మంది ఓటర్లు తక్కువగా నమోదుకావడం విశేషం.
జాబితాలోని కొన్ని ముఖ్య విషయాలు...
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 23,3905 ఓటర్లతో అత్యధిక ఓట ర్లున్న నియోజకవర్గంగా మొదటిస్థానంలో ఉంది. తరువాత స్థానం లో భూపాలపల్లి నియోజక వర్గం ఉంది.
పరకాలలో 18,7434 మంది ఓట ర్లతో జిల్లాలో అతి తక్కువ ఓట ర్లున్న నియోజకవర్గంగా ఉంది. తరువాత స్థానంలో డోర్నకల్ ఉం ది. రెండు నియోజక వర్గాల మధ్య 16ఓటర్లు మాత్రమే వ్యత్యాసం ఉంది.
జిల్లా ఓటర్లలో మహిళల కన్నా పురుషులు 2625 మంది ఎక్కువగా ఉన్నారు.
డోర్నకల్, మహబూబాబాద్, నర్సం పేట, పరకాల, ములుగు నియోజకవర్గాల్లో పురుషులకన్నా మహిళలు అధికంగా ఉన్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మహిళల కన్నా పురుషులు 10మంది ఎక్కువ ఉన్నారు.
జాబితాలో ‘ఇతరుల’ కేటగిరీలో 185 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో అత్యధికంగా తూర్పులో 56మంది ఉన్నారు. తరువాత స్థానం భూపాలపల్లిది.
నవంబర్‌లో ప్రకటించిన ముసాయి దా జాబితాలో జిల్లా ఓటర్లు 25,16, 353 మంది వుండగా తుదిజాబితా ప్ర కారం 24,96,622 మంది ఉన్నారు.