oters
-
వోటథాన్ యాప్ ప్రారంభించిన లెట్స్‌వోట్ - వచ్చే వారంలో వాకథాన్ కూడా..
Digital Democracy Votathon App: ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లాభాపేక్షలేని పౌర సమాజ సంస్థ లెట్స్‌వోట్ 'డిజిటల్ డెమోక్రసీ వోటథాన్' యాప్‌ను విడుదల చేసింది. ఈ నెల 25న (నవంబర్ 25) గచ్చిబౌలి స్టేడియంలో 'స్టోరీబాక్స్'ను ఆవిష్కరించడమే కాకుండా ఓటు హక్కు, ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు 'వాకథాన్'ను నిర్వహించనున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిజిటల్ డెమోక్రసీ వోటథాన్ యాప్ ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి.. ఓటు ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి వోటథాన్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పౌరులు 'లైఫ్ సైకుల్' (Lifecykul) యాప్ డౌన్లోడ్ చేసుకుని పాల్గొనటానికి వోటథాన్ విభాగానికి వెళ్లాలి. ఆ తరువాత ఓటింగ్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి వాకింగ్ లేదా సైక్లింగ్ చేయడం ప్రారంభించవచ్చు. ప్రతి సెషన్ ముగిసే సమయానికి వినియోగదారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారో ఖచ్చితంగా తెలుసుకుంటారు. స్టోరీబాక్స్ స్టోరీబాక్స్ అనేది కంటెంట్ అందించే ఒక వినూత్న ఆలోచన. యువ పాఠశాల విద్యార్థులను చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు, కాబట్టి ఓటు హక్కు గురించిబ తెలుసుకుంటారు. అదే సమయంలో పెద్దలను ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రేరేపిస్తారు. లెట్స్‌వోట్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కంటెంట్‌ను ప్రారంభించింది. వివిధ పాఠశాలల యాజమాన్యాలతో కలిసి పనిచేయడం కూడా మొదలు పెట్టింది. ప్రస్తుతం 25 పాఠశాలల్లో ప్రారంభమైన ఈ స్టోరీబాక్స్ కంటెంట్ 40 పాఠశాలలకు చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. స్టోరీబాక్స్ మీద ఆసక్తి ఉన్న యాజమాన్యం స్టోరీబాక్స్ను ఇన్స్టాల్ చేసుకోవడానికి లెట్స్‌వోట్ టీమ్‌ను సంప్రదించవచ్చు. వాకథాన్ వచ్చే శనివారం (నవంబర్ 25) రోజు ఓటుపై అవగాహన పెంచేందుకు లెట్స్‌వోట్ ద్వారా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ భాగస్వామ్యంతో వాకథాన్ నిర్వహించనున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం 6:30 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ వాకథాన్‌లో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, మొదటిసారి ఓటు వేయనున్న ఓటర్లు, సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా ఇతర ప్రముఖులు సుమారు 4000 కంటే ఎక్కువమంది పాల్గొనే అవకాశం ఉందని ఓటు వేద్దాం జాతీయ కన్వీనర్ డాక్టర్ కె సుబ్బరంగయ్య అన్నారు. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ఓటరు అవగాహన కోసం నిరవహించే ఈ వాకథాన్‌లో వేసే ప్రతి అడుగు ఒక బలమైన ప్రజాస్వామ్యం నిర్మించడంలో ఉపయోగపడుతుంది. కొత్త ఓటర్లు.. అనుభవజ్ఞులైన వారితో చేతులు కలపడం ఇక్కడ జరుగుతుంది. కేవలం మన ఓటు వేయడమే కాకుండా.. భవిష్యత్తును రూపొందించడానికి కూడా ఇది ఒక మంచి వేదికగా అవుతుందని లెట్స్‌వోట్ పబ్లిసిటీ కన్వీనర్ షీలా పనికర్ తెలిపారు. -
జిల్లా ఓటర్లు 29,55,432
అనంతపురం అర్బన్ : జిల్లాలో మొత్తం 29,55,432 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుçషులు 14,93,260, మహిళలు 14,61,951, ఇతరులు 221 మంది ఉన్నారు. ఓటర్ల తుది జాబితాను జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సి.మల్లీశ్వరిదేవి సోమవారం తన చాంబర్లో విడుదల చేశారు. గత ఏడాది నవంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు ప్రత్యేక ఓటరు నమోదు చేపట్టామన్నారు. ఇందులో కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6 ద్వారా 36,224 దరఖాస్తులు రాగా.. ఇందులో 33,886 ఆమోదించామని ఆమె తెలిపారు. 2,338 తిరస్కరణకు గురయ్యాయన్నారు. ఫారం–7 ద్వారా అభ్యంతరాలు స్వీకరించగా 12,955 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 12,098 ఆమోదించామన్నారు. 817 తిరస్కరణకు గురయ్యాయన్నారు. జిల్లాలో 1,902 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. లింగ నిష్పత్తి ప్రకారం ప్రతివెయ్యి మంది పురుష ఓటర్లకు 979 మంది మహిళా ఓటర్లు, జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి వెయ్యిమంది జనాభాకు 680 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. 5,805 మంది చనిపోయిన, 1,508 మంది శాశ్వతంగా గ్రామం వదిలివెళ్లిన, 6,303 మంది డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. -
ఉప ఎన్నికల వేడి
–నేడు పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రదర్శన – రెండు జెడ్పీటీసీ, 18 సర్పంచ్ పదవులు, 22 ఎంపీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నిక – 129 వార్డు పదవులకూ ఉప సమరం కొవ్వూరు : స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన ప్రజాప్రతినిధుల ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక ఎన్నికల కమిషన్ ఏర్పాటులో జాప్యం కారణంగా వీటికి ఉప ఎన్నికలు మరుగునపడ్డాయి. దాదాపు మూడేళ్ల నాలుగు నెలల అనంతరం ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సమాయత్తం అవుతోంది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు ఐదేళ్ల పదవీ కాలంలో ముగిసిన రోజులు మిన హాయిస్తే సుమారు ఏడాదిన్నర మాత్రమే పదవిలో ఉంటారు. పదవీ కాలం తక్కువే అయినా ఉప ఎన్నికలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 18 సర్పంచ్, 22 ఎంపీటీసీ, రెండు జెడ్పీటీసీ స్థానాలతోపాటు 129 పంచాయతీ వార్డు మెంబర్ పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటితోపాటు కొవ్వూరు, తణుకు మునిసిపాలిటీల్లో ఒక్కొక్క కౌన్సిలర్ ఉప ఎన్నిక నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ నుంచి జిల్లాలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల జెడ్పీటీసీ సభ్యులతోపాటు కుక్కునూరులో ఎనిమిది, వేలేరుపాడులో ఏడు ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో విలీనమైన రెండు మండలాలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పాలనాపరంగా రెండు మండలాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వపరంగా అందే రాయితీలకు సైతం ఇక్కడి ప్రజలు దూరమవుతున్నారు. మొత్తంగా ఈ ఉప ఎన్నికల్లో అన్నీ పదవులు కలిపి 171 పదవులకు ఉప సమరం జరగనుంది. టీడీపీలో గుబులు అధికార టీడీపీకి ఉప ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన రైతు, డ్వాక్రా రుణమాఫీలతో పాటు కీలక హామీలు సక్రమంగా అమలు కాకపోవడం ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. గ్రామాల్లో ఏ ఒక్కరికీ ఇల్లు, ఇల్లు స్థలం మంజూరుకాకపోవడంపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఇంటికో ఉద్యోగం, బాబు వస్తే జాబు, నిరుద్యోగులకు రూ.2 వేలు భతి హామీలను తుంగలో తొక్కడంపై నిరుద్యోగులు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా పేదలకు అందకపోవడం వంటి అంశాలు ఆ పార్టీ నేతల్లో గుబులు రేపుతున్నారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు సర్కారు అవలభిస్తున్న వైఖరి కారణంగా ఉప ఎన్నికలపై ఏవిధమైన ప్రభావం పడుతుందోన న్న భయం నాయకులను వెంటాడుతోంది. వ్యూహ, ప్రతివ్యూహాలు రానున్న ఉప ఎన్నికలకు అధికార టీడీపీ, వైఎస్సార్ సీపీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై స్థానిక నాయకులు తర్జనభర్జనలు పడుతున్నారు. కులాల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. పెద్ధేవం, కుమారదేవంలో వైఎస్సార్ సీపీ నుంచి గట్టిపోటీ ఎదుర్కొనే అవకాశం ఉండటంతో టీyీ పీ బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఆరికిరేవుల, నెలటూరులో తమ ఎంపీటీసీ స్థానాలు పదిలం చేసుకోవాలని అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల్లోకి వెళుతూ సమస్యలు తెలుసుకుంటూ ప్రతిపక్షం బలమైన పాత్ర పోషిస్తుంది. దీంతో నవంబర్ 1 నుంచి జనచైతన్య యాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటెత్తారు
7 గంటలకేబారులు తీరిన ఓటర్లు పోలింగ్‌పై కానరాని పండగ ప్రభావం కొన్నిచోట్ల పోలీసుల ఓవర్ యాక్షన్ ఓటింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ నర్సీపట్నం/యలమంచిలి, న్యూస్‌లైన్ : జిల్లాలోని నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల అంచనాలకు మించి యలమంచిలిలో 82.99 శాతం, నర్సీపట్నంలో 76.14శాతం నమోదయింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటలకే బారులు తీరారు. కొత్త అమావాస్య పం డగ ప్రభావంతో ఒకదశలో మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నానికి పుంజుకుంది. మరోపక్క ఎండ తీవ్రత తగ్గడం కూడా పోలింగ్ శాతం పెరిగేందుకు దోహదపడింది. అభ్యర్థులు, వారి అనుచరులు, ఆయా పార్టీల కార్యకర్తలు ఓటర్లను ఆటోలు, రిక్షాలు, ద్విచక్రవాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఒకేసారిగా పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడంతో కొన్ని కేంద్రాల వద్ద గంటలతరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. వృద్ధులు, వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలవద్ద ప్రత్యేక ఏర్పాట్లు చే శారు. సాయంత్రం 5గంటలకు పోలింగ్ పూర్తయింది. యలమంచిలి మున్సిపాలిటీలో 32,459 మంది ఓటర్లు ఉన్నారు. రెండో వార్డు ఏకగ్రీవం అయింది. 23 వార్డుల్లోని 31,168 మందికి 25,867 ఓట్లు పోలయ్యాయి. 82.99 శాతంగా నమోదయింది. 23 వార్డుల్లో 58మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఉదయం 9గంటలకు 19శాతం, 11గంటలకు 40.80శాతం, 1గంటకు 60.18శాతం, 3గంటలకు 74.86శాతం పోలింగ్ నమోదయింది. 8వ వార్డులో వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి ఆడారి లక్ష్మీదేవి, టీడీపీ అభ్యర్థి పిళ్లా రమాకుమారిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్ కొక్కిరాపల్లి పోలింగ్‌స్టేషన్‌ను పరిశీలించి పోలింగ్ శాతం, భద్రతా ఏర్పాట్లపై ఆరాతీశారు. ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ పెదపల్లి, యలమంచిలి తులసీనగర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సిబ్బందిని ఆరా తీశారు. నర్సీపట్నంలోని 27 వార్డుల్లో మొత్తం 76.14 శాతం మంది ఓటు వేశారు. ఈ పట్టణంలోని మొత్తం 44,097 ఓటర్లకు 33,574 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్త అమావాస్య పండగ సందర్భంగా ఇక్కడి మహిళలంతా ఆలయాలకు వెళ్లడంతో ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నానికి పుంజుకుంది. ఈ విధంగా ఉదయం 9 గంటలకు 16శాతం, 11 గంటలకు 35, ఒంటి గంటకు 57.8, 3 గంటలకు 66.33, పోలింగ్ ముగిసే సమయానికి 76.14 శాతం పోలింగు నమోదయింది. ఇక్కడి పోలింగ్ సరళిని కలెక్టరు ఆరోఖ్యరాజ్, ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఎన్నికల ప్రత్యేక పరిశీలకురాలు అనితా రామచంద్రన్‌తో పాటు ఆర్డీవో సూర్యారావు, మున్సిపల్ ఎన్నికల అధికారి సింహాచలం పరిశీలించారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లోనే ఎన్నికలు జరుగుతుండడంతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో కొందరు పోలీసులు, పోలీసు అధికారులు కేంద్రాలవద్ద ఓవర్‌యాక్షన్ చేశారు. బూత్‌లకు సమీపంలో ఉన్న అభ్యర్థులను సైతం జీపుల్లో ఎక్కించి, సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచారు. అలాగే ఏజెంట్లను సైతం బూత్‌ల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ కారణంగా కొన్నిచోట్ల వివాదాస్పదమైంది. చిన్న, చిన్న అవాంతరాల నడుమ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
‘శాంతి’ కోసం సమరం
నిజామాబాద్క్రైం, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మధ్యలో పం చాయతీ ఎన్నికలూ వచ్చిపడ్డాయి. అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించే అవకాశముంది. దీనిని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం చ ర్యలు తీసుకుంటోంది. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హ క్కు వినియోగించుకునేలా చూసేందుకు కసరత్తు చే స్తోంది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరం గా తనిఖీలు నిర్వహిస్తోంది. జిల్లాలో ఈ నెలలో ఇ ప్పటికే కోటి రూపాయలకుపైగా నగదు, 3 కిలోల బంగారం, 24 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లాలో 2,056 మందిని తహశీల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు. 327 కేసులు నమోదు చేశారు. తుపాకీ లెసైన్స్ కలిగినవారి వద్దనుంచి ఆయుధాలను డిపాజిట్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 898 తుపాకులను డిపాజిట్ చేసుకున్నారు. బాన్సువాడలో అనుమతి లేకుండా వాడుతున్న ఓ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 174 వారెంట్ కేసులు ఉండగా, 18 కేసులను ఛేదించి, నిందితులను కోర్టులో హాజరు పరిచారు. మద్యంపై నియంత్రణ మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి దేశీదారు, మద్యం అక్రమంగా జిల్లాలోకి రవాణా అయ్యే అవకాశాలుండడంతో చెక్‌పోస్టులు, పికెట్ల వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈనెలలో 66 కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ సిబ్బంది.. 457 లీటర్ల మద్యం(148 ఎంఎల్) స్వాధీనం చేసుకున్నారు. అలాగే 59 కిలోల గంజాయిని పట్టుకున్నారు. భారీగా బలగాలు నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపుతున్నారు. ఎన్నికల కోసం నలుగురు డీఎస్పీలు, 22 మంది సీఐలు, 42 మంది ఎస్ఐలు, 300 మంది ఏఎస్ఐలు, 779 మంది కానిస్టేబుళ్లు, 363 మంది హోంగార్డులు, 300 మహిళా హోంగార్డులను ఎన్నికల విధుల్లో నియమించారు. హైదరాబాద్ నుంచి 181 మంది మహిళా కానిస్టేబుళ్లను రప్పిస్తున్నారు. -
జిల్లా ఓటర్లు.. 2496622
పురుషులు 1249531..మహిళలు 1246906 వరంగల్ పశ్చిమలో ఎక్కువ.. పరకాలలో తక్కువ తుదిజాబితా విడుదల చేసిన కలెక్టర్ నేటి నుంచి మళ్లీ నమోదుకు అవకాశం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ శుక్రవారం ప్రకటించారు. తుది జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు 24,96,622 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 12,49,531 కాగా.. మహిళలు 12,46,906 మంది ఉన్నారు. వీరితో పాటు ‘ఇతరులు’ కేటగిరీలో 185 మంది నమోదయ్యారు. 1-1-2014 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండినవారందరికీ జాబితాలో చోటు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానించిన అధికారులకు.. ముసాయిదా జాబితా ప్రకటన తరువాత 1.50 లక్షలవరకు నమోదు, చేర్పులు, మార్పులు, తొలగింపునకు దరఖాస్తులు అందాయి. ఆన్లైన్ ద్వారా, నేరుగా దరఖాస్తులు స్వీకరించిన అధికారులు అర్హులందరికీ జాబితాలో చోటు కల్పించారు. శుక్రవారం తుది జాబితా ప్రకటన తరువాత ఫిబ్రవరి ఒకటి నుంచి ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల కోసం మళ్లీ ఆన్‌లైన్‌ద్వారా, నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం జాబితాలో పేర్లున్న అందరూ ఆన్‌లైన్‌ద్వారా ఓటరు గుర్తింపు కార్డులు పొందవచ్చు. అయితే నవంబర్‌లో ప్రకటించిన ముసాయిదా కన్నా.. శుక్రవారం ప్రకటించిన తుది జాబితాలో 19,731మంది ఓటర్లు తక్కువగా నమోదుకావడం విశేషం. జాబితాలోని కొన్ని ముఖ్య విషయాలు... వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 23,3905 ఓటర్లతో అత్యధిక ఓట ర్లున్న నియోజకవర్గంగా మొదటిస్థానంలో ఉంది. తరువాత స్థానం లో భూపాలపల్లి నియోజక వర్గం ఉంది. పరకాలలో 18,7434 మంది ఓట ర్లతో జిల్లాలో అతి తక్కువ ఓట ర్లున్న నియోజకవర్గంగా ఉంది. తరువాత స్థానంలో డోర్నకల్ ఉం ది. రెండు నియోజక వర్గాల మధ్య 16ఓటర్లు మాత్రమే వ్యత్యాసం ఉంది. జిల్లా ఓటర్లలో మహిళల కన్నా పురుషులు 2625 మంది ఎక్కువగా ఉన్నారు. డోర్నకల్, మహబూబాబాద్, నర్సం పేట, పరకాల, ములుగు నియోజకవర్గాల్లో పురుషులకన్నా మహిళలు అధికంగా ఉన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మహిళల కన్నా పురుషులు 10మంది ఎక్కువ ఉన్నారు. జాబితాలో ‘ఇతరుల’ కేటగిరీలో 185 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో అత్యధికంగా తూర్పులో 56మంది ఉన్నారు. తరువాత స్థానం భూపాలపల్లిది. నవంబర్‌లో ప్రకటించిన ముసాయి దా జాబితాలో జిల్లా ఓటర్లు 25,16, 353 మంది వుండగా తుదిజాబితా ప్ర కారం 24,96,622 మంది ఉన్నారు.