దరఖాస్తు.. అవస్థల మస్తు
నమూనా ఫారం నుంచి ప్రతిదానికీ డబ్బులతో లింకు
ఒక్క ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికే రూ.800 వరకు ఖర్చు
దరఖాస్తు ఫీజులు భారీగా పెంచేసిన ప్రభుత్వ సంస్థలు
యూజర్ చార్జీల పేరుతో మరింత వాత పెడుతున్న రిమ్స్
ఆన్‌లైన్ విధానంతో మరికొంత భారం
ఆందోళన చెందుతున్న పేద నిరుద్యోగులు
రిమ్స్‌క్యాంపస్: గతంలో ఉద్యో గాలకు దరఖాస్తు చేయడానికి రూ.50.. అంతకుమించి మహా అయితే రూ.100 లోపే సరిపోయేది. దరఖాస్తు ఫారం, దానితోపాటు చెల్లించాల్సిన ఫీజలు చాలా తక్కువగా ఉండేవి. కొన్ని ఉద్యోగాలకు ఫీజులు కూడా ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నా.. వాటికి దరఖాస్తు చేయడమే నిరుద్యోగులకు పెద్ద సమస్యగా మారింది. దరఖాస్తు ఫారం నుంచి దానికి జత చేయాల్సిన ధ్రువపత్రాలు పొందడానికి యూజర్ చార్జీలు, దరఖాస్తు ఫీజు..ఇలా ఒక్కో దరఖాస్తుకు రూ.700 నుం చి రూ.వెయ్యి వరకు చేతి చుమురు వదిలించుకోవాల్సి వస్తోంది. ఎన్ని ఉద్యోగాలకు
ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పెద్దలు.. అఫ్‌కోర్స్..ఇప్పుడు మహిళలకు కూడా అదే లక్షణం అబ్బిందనుకోండి.. అది వేరే విషయం. చదువు పూర్తికాగానే.. ఏదో ఒక ఉద్యోగంలో చేరి.. నాలుగు రాళ్లు సంపాదించడం ద్వారా కుటుంబానికి ఆర్థిక ఆసరా కల్పించాలని పేద, మధ్య తరగతి వర్గాల యువత తాపత్రయపడటం సహజం. ఉద్యోగం రావాలంటే ముందు దరఖాస్తు చేసుకోవాలి. ఏముంది.. దరఖాస్తు చేసుకోవడమే కదా!.. ఒక తెల్ల కాగితం మీద మన బయోడేటా పూర్తిగా రాసి పంపితే సరిపోతుంది కదా? అనుకోవడానికి లేదు. ఇది గత కాలం ముచ్చట. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ ప్రక్రియే పెద్ద ఖర్చుతో కూడిన పనిగా మారింది. ఆర్థిక భారంగా పరిణమించింది.