బాబులా అబద్దాలు చెప్పం-హామీలు నెరవేరుస్తాం: విజయమ్మ | We fulfill promises: YS Vijayamma | Sakshi
Sakshi News home page

బాబులా అబద్దాలు చెప్పం-హామీలు నెరవేరుస్తాం: విజయమ్మ

Published Tue, Oct 29 2013 8:15 PM | Last Updated on Wed, Aug 1 2018 3:52 PM

బాబులా అబద్దాలు చెప్పం-హామీలు నెరవేరుస్తాం: విజయమ్మ - Sakshi

బాబులా అబద్దాలు చెప్పం-హామీలు నెరవేరుస్తాం: విజయమ్మ

విశాఖపట్నం: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులాగా తాము అబద్దాలు చెప్పం అని, ఇచ్చిన హామీలు నెరవేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం విజయమ్మ విశాఖ జిల్లాలోకి ప్రవేశించారు. నక్కపల్లి మండలం గుడిచర్ల వద్ద నీటమునిగిన పొలాలను పరిశీలించారు. వరహానది ప్రవాహాన్ని చూశారు. వరదబాధితులను పరామర్శించారు.  విజయమ్మ ఎదుట బాధితులు తమ బాధను వెళ్లబోసుకున్నారు. అధైర్యపడవద్దని, సహాయం అందే విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని బాధితులకు చెప్పారు.

అనంతరం విశాఖ చేరుకున్న ఆమె విలేకరులతో మాట్లాడుతూ రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్జిడీ రైతులకు వర్తించేలా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు.  రైతులకు ఏ రకమైన సహాయం అవసరమో ఆ రకమైన సహాయం అందించేందుకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement