
సాక్షి, కర్నూల్: నంద్యాలలో పెళ్లిపీటలదాగా వచ్చిన ఓ పెళ్లి ఆగిపోయింది. తిరుపతిలో ఒకరితో నిశ్చితార్థం చేసుకుని.. నంద్యాలలో మరొకరితో వివాహానికి సిద్ధపడ్డాడు వరుడు మోహనకృష్ణ. తిరుపతికి చెందిన యువతి బంధువులు పెళ్లిని అడ్డుకొని ఆందోళనకు దిగారు. దీంతో పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వరుడు మోహనకృష్ణతోపాటు ఆందోళనకు దిగిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నారు.