జమ్మలమడుగు,న్యూస్‌లైన్: ఒక అరగంట ఆగివుంటే తమ గమ్యాలకు చేరుకునేవారు. అయితే లారీ రోడ్డు మధ్యలో నిలబడివుండటంతో డ్రైవర్ వెనుకవైపు నుంచి వేగంగా తగిలించడంతో క్వాలిస్ వాహనం లారీ వెనుక భాగంలోనికి దూసుకెళ్లింది. అక్కడే ఒక మహిళ మరణించగా మరోమహిళ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరి మహిళలకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా... ప్రొద్దుటూరుకు చెందిన మేరువ రామలక్షుమ్మ, సంకం కల్యాణిదేవి, ప్రభావతి, శైలజ రెండురోజుల క్రితం కర్నాటక రాష్ట్రం గుల్బార్గాలోని గానుగపూర్‌లోవున్న సాయిబాబా దర్శనానికి వెళ్లారు.
అక్కడ దర్శనం ముగించుకుని శనివారం సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున జమ్మలమడుగు బైపాస్‌లోని రైల్వేస్టేషన్ సమీపంలోనికి రాగానే రోడ్డుకు మధ్యలో అగివున్న లారీని వెనుకవైపునుంచి వేగంగావచ్చి డ్రైవర్ తగిలించడంతో మేరువ రామలక్షుమ్మ (50) అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రగాయాలైన కల్యాణిదేవి(68) చికిత్సపొందుతూ మరణిం చింది. డ్రైవర్ యేసన్నతోపాటు ప్రయాణికులు ప్రభావతి, శైలజకు గాయాలయ్యాయి. అర్బన్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
దైవదర్శనం చేసుకుని వస్తూ..
Published Mon, Feb 17 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
Advertisement
Advertisement