ఆధార్ లేని వారికి రుణ మాఫీ లేదు!
గ్రామ స్థాయిలో కుటుంబ వివరాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: ఆధార్‌కార్డు లేని వారికి రుణ మాఫీ వర్తింప చేయరాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ ఉండి రేషన్ కార్డు లేని ఖాతాల వివరాలను తిరిగి బ్యాంకులకు పం పించాలని, గ్రామ సభల్లో ఆ ఖాతాలకు చెందిన వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. బ్యాంకుల నుంచి రైతుల రుణ ఖాతాల వివరాల సేకరణను శనివారం సాయంత్రం నిలి పేశారు. బ్యాంకుల నుంచి రైతుల రుణాలపై వచ్చిన వివరాలను సోమవారం నుంచి వడపోత చేయనున్నారు.
స్టేట్ రెసిడెంట్ డేటా హబ్‌తో రైతుల ఖాతాల వివరాల వడపోతను చేపడతా రు. కుటుంబంలో ఎంత మంది రుణాలు తీసుకున్నా వారిని ఒకే యూనిట్‌గా పరిగణించి రూ.లక్షన్నర వరకే మాఫీకి అర్హులుగా తేల్చనున్నారు. దీంతో పంట రుణంతో పాటు బంగారం కుదవ పెట్టి రుణం తీసుకున్న రైతుల సంఖ్య కోటి నుంచి కేవలం 20 లక్షలకు తగ్గిపోతుందని అధికారులు అంచనాకు వచ్చారు.