సాక్షి, హైదరాబాద్: కేంద్రంపై అవిశ్వాసం నోటీసును ఎందుకు ఉపసంహరించుకున్నారో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. పార్టీ నేతలు సి.ఎం.రమేష్, ధూళిపాళ్ల నరేంద్ర శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గత డిసెంబర్ 9 నుంచి 18 వరకూ వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాసంపై నోటీసులు ఇచ్చారని, 18న వైఎస్సార్‌సీపీని స్పీకర్ పిలిచి అవిశ్వాసంపై చర్చకు సిద్ధంగా ఉండాలని సూచించగా, వెంటనే నోటీసును ఉపసంహరించుకుంటున్నట్టు సమాచారం ఇచ్చారని వారు ఆరోపించారు.