భద్రాచలాన్ని విడదీస్తే సాయుధ పోరే : శ్రీనివాస్‌గౌడ్ | Will Armed conflict start, if congress try to Split Badhrachalam from telangana: Srinivas goud | Sakshi
Sakshi News home page

భద్రాచలాన్ని విడదీస్తే సాయుధ పోరే : శ్రీనివాస్‌గౌడ్

Published Fri, Nov 22 2013 2:08 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Will Armed conflict start, if congress try to Split Badhrachalam from telangana: Srinivas goud

ఖమ్మం, న్యూస్‌లైన్ : తెలంగాణలో అంతర్భాగమైన భద్రాచలాన్ని విడదీయాలని చూస్తే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు  ఈ నెల 24 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన గురువారం ఖమ్మంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో  మాట్లాడుతూ, భద్రాచలం కోసం సాయుధ పోరాటానికి కూడా వెనకాడబోమన్నారు. పోలవరం నిర్మాణం కోసం.. గిరిజనులను ముంచేందుకు... భూగర్భ సంపదను వారి అధీనంలో పెట్టుకునేందుకు భద్రాచలం కావాలని అడుగుతున్నారని ఆరోపించారు. ఎస్టీ నియోజకవర్గమైన భద్రాచలాన్ని సీమాంధ్రలో కలిపితే జనరల్ అవుతుందని, అప్పుడు గిరిజనులకు సమన్యాయం ఎలా దక్కుతుందని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement