కాంగ్రెస్ మద్దతు తీసుకునే అవకాశమే రాదు: కేటీఆర్
హైదరాబాద్: ఎవరి మద్దతు లేకుండా సొంతంగానే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆపార్టీ ఎమ్మెల్యే కే తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందని వస్తున్న వార్తలను కేటీఆర్ ఖండించారు. టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభిస్తుందని ఆయన విశ్వాసం ప్రకటించారు. నిశ్శబ్దంగా, చాపకింద నీరులా టీఆర్ఎస్ కు ఓటుతో ప్రజలు బలంగా మద్దతు తెలిపారని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ కు అత్యధిక స్థానాలు వస్తాయని మీడియా, ఇంటలిజెన్స్ ద్వారా సమాచారం తమకు ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకునే అవకాశమే రాదని కేటీఆర్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం చేయకూడదనే నిర్ణయం కారణంగా తమకు అనూహ్యమైన మద్దతు తెలంగాణ ప్రజల నుంచి లభించిందని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.