ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణ దీక్షలో విషాదం చోటు చేసుకుంది.
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణ దీక్షలో విషాదం చోటు చేసుకుంది. విజయవాడలో మంగళవారం జరిగిన నవనిర్మాణ దీక్షకు హాజరైన అనసూయ అనే కూలీ తిరిగి వెళ్తుండగా గుండెపోటుతో మరణించింది. మృతురాలి కుటుంబసభ్యులను మంత్రి దేవినేని ఉమ పరామర్శించినట్లు సమాచారం.