సీతానగరం(తూర్పుగోదావరి): ఓ వ్యక్తి నిమజ్జనానికి వెళ్లి గల్లంతయ్యాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని రఘుదేవాపురం గ్రామానికి చెందిన పోచయ్య(20), నిమజ్జనానికి వెళ్లి ముగ్గళ్లలోని గోదావరి రేవులో గల్లంతయ్యాడు. బాధితుడి ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు.