కృష్ణా నీటితో రైతులకు లబ్ధి | YS Avinash Reddy Released Krishna Water In YSR Kadapa | Sakshi
Sakshi News home page

కృష్ణా నీటితో రైతులకు లబ్ధి

Published Sun, Aug 25 2019 12:47 PM | Last Updated on Sun, Aug 25 2019 8:20 PM

YS Avinash Reddy Released Krishna Water In YSR Kadapa - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరగడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గండికోట జలాశయానికి కృష్ణా నీరు భారీగా చేరుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం జీఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలోని గండికోట జలాశయం నుంచి పైడిపాలెం, చిత్రావతి, సర్వరాయసాగర్, మైలవరం జలాశయాలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  కృష్ణా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఈ నీటి విడుదల వల్ల పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గల్లోని రైతులు లబ్ధి పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవినాష్‌ రెడ్డితోపాటు జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement