
సాక్షి, తాడేపల్లి : శ్రీ మహారుద్రసహిత ద్విసహస్ర చండీయాగ దీక్షాంత పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. సోమవారం (జూలై 1) ఉదయం 10.25 గంటలకు సీఎం చేతులమీదుగా తాడేపల్లిలోని సీఎస్‌ఆర్ కళ్యాణమండపంలో పూర్ణాహుతి జరుగుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరిమండ వరప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొనున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయదుందుభి మోగించాలని, ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని 2017 జూలై 29 నుంచి 2019 జూన్ 29 వరకు ఈ చండీయాగాన్ని నిర్వహించారు. రుద్రయాగ దీక్ష పరిపూర్ణమైన సందర్భంగా సోమవారం పూర్ణాహుతి కార్యక్రమం జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment