తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 10.30 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు.
సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 10.30 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. బెయిల్ పొందిన తర్వాత ఆయన మొదటిసారిగా కోర్టుకు హాజరుకానున్నారు. గత నెల 23న బెయిల్ మంజూరు చేసిన సీబీఐ కోర్టు.. కేసు విచారణలో భాగంగా ప్రతి వాయిదాకు హాజరుకావాలని షరతు విధించిన విషయం తెలిసిందే.