హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారణకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత హాజరు మినహారుుంపునకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
వారం రోజులుగా జగన్ హుదూద్ తుపాను బాధితులను పరామర్శిస్తున్నారని, మరికొన్ని రోజులు అక్కడే ఉంటారని, ఈ నేపథ్యంలో మంగళవారం కోర్టు విచారణకు జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నివ్వాలని ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి ఈ ఉత్తర్వులిచ్చారు.
జగన్ హాజరుకు ప్రత్యేక కోర్టు మినహాయింపు
Published Tue, Oct 21 2014 1:01 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement