చితికిన బతుకులకు..కొండంత అండగా..
సాక్షి, రాజమండ్రి :హుదూద్ తీవ్ర తుపాను సృష్టించిన విలయంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ జిల్లా పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో విశాఖ జిల్లాకు బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో జగ్గంపేటవద్ద విశాఖ తుపాను బాధితులకు అందించేందుకు సిద్ధం చేసిన ఐదు మంచినీటి ట్యాంకర్లను జెండా ఊపి ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్టీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ తరఫున వీటిని సమకూర్చారు.
జగ్గంపేట నుంచి మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరిన జగన్‌మోహన్‌రెడ్డి 2 గంటల సమయానికి తుని సమీపంలోని రాజుల కొత్తూరు గ్రామానికి చేరుకున్నారు. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో తుపాను సృష్టించిన బీభత్సం గురించి అక్కడ పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి బయలుదేరి సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని విశాఖ జిల్లా నక్కపల్లి చేరుకున్నారు. తుపానుతో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. అక్కడ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ జిల్లా పూడిమడక చేరుకున్నారు. హుదూద్ తుపాను తీరం దాటిన ఈ ప్రాంతంలో దెబ్బతిన్న మత్స్యకార గృహాలు పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉండి పోరాడతానని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. అక్కడ నుంచి విశాఖ జిల్లా గాజువాక చేరుకున్నారు.
వెన్నంటి నిలిచిన నాయకులు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు హైదరాబాద్ నుంచి పార్టీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు కూడా వచ్చారు. అప్పటికే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. వారితోపాటు జ్యోతుల నెహ్రూ; ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు; ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి; సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి; మాజీ మంత్రి పినిపే విశ్వరూప్; మాజీ ఎంపీ గిరజాల వెంకట స్వామినాయుడు; మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు; పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జక్కంపూడి రాజా, జీవీ రమణ; పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి; జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్; రాజమండ్రి నగరపాలక సంస్థలో పార్టీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి; సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని; జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు; వివిధ సెల్‌ల జిల్లా కన్వీనర్లు కర్రి పాపారాయుడు, అనంత ఉదయ భాస్కర్, శెట్టిబత్తుల రాజబాబు, రెడ్డి రాధాకృష్ణ, రావూరి వెంకటేశ్వర్లు; కో ఆర్డినేటర్లు సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, తోట సుబ్బారావునాయుడు; పార్టీ వివిధ విభాగాల రాష్ట్ర కమిటీ సభ్యులు వాసిరెడ్డి జమీల్, తాడి విజయభాస్కరరెడ్డి, మాసా రాంజోగ్; కాకినాడ సిటీ కన్వీనర్ ఫ్రూటీ కుమార్; ఇతర నాయకులు మిండగుదిటి మోహన్, విప్పర్తి వేణుగోపాల్, కొవ్వూరి త్రినాథరెడ్డి, బషీరుద్దీన్, ఆదిరెడ్డి వాసు, నక్కా చిట్టిబాబు, గుర్రం గౌతమ్ తదితరులు జగన్ వెంట ఉన్నారు.