ప్రతిపక్షనేతగా సంతాపం తెలిపే హక్కులేదా?: వైఎస్ జగన్ | ys jagan mohan reddy fight force to speak in ap assembly | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షనేతగా సంతాపం తెలిపే హక్కులేదా?: వైఎస్ జగన్

Published Thu, Dec 18 2014 9:33 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

ప్రతిపక్షనేతగా సంతాపం తెలిపే హక్కులేదా?: వైఎస్ జగన్ - Sakshi

ప్రతిపక్షనేతగా సంతాపం తెలిపే హక్కులేదా?: వైఎస్ జగన్

హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని కించపరిచేలా వ్యహరిస్తున్నారని శాసనసభా పక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ సంతాప తీర్మానం సందర్భంగా ప్రతిపక్ష నేతగా సంతాపం తెలిపే హక్కులేదా అని ఆయన ప్రశ్నించారు.  సభా నాయకుడు మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నేత మాట్లాడటం  సంప్రదాయమని..వైఎస్ జగన్ గుర్తు చేశారు.  సంప్రదాయాల్ని అధికార పార్టీ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభా సంప్రదాయాలను స్పీకర్ పాటించాలని వైఎస్ జగన్ అన్నారు.

ఎమ్మెల్యే వెంకటరమణ మృతి బాధాకరమన్నారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో వెంకటరమణ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున విజయం సాధించిన విషయాన్ని జగన్‌ మోహన్‌ రెడ్డి గుర్తు చేశారు. తమ తరపు నుంచి వెంకటరమణ కుటుంబానికి సహాయ సహకారాలు ఉంటాయని వైఎస్ జగన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement