వైఎస్ఆర్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు.
కాకినాడ : వైఎస్ఆర్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. బుధవారం ఫోన్ చేసిన వైఎస్ జగన్ ఈ సందర్భంగా నెహ్రు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జ్యోతుల నెహ్రు అస్వస్థతతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన కాకినాడ సేఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు జ్యోతుల నెహ్రును వివిధ రాజకీయ పక్షాల నేతలు పరామర్శించారు.