సాక్షి, అమరావతి: మొక్కజొన్నకు ప్రకటించిన కనీస గిట్టుబాటు ధర కోసం చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మార్కెటింగ్శాఖపై సీఎం వైఎస్ జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న, జొన్న మార్కెట్‌కి వచ్చే సమయం ఇదని, వీటి ధరల్లో తగ్గుదల ఉందన్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని, ఖరీఫ్, రబీలో వరి ఉత్పత్తి పెరిగిందని అధికారులు సీఎం జగన్ తెలిపారు. గౌడౌన్స్ ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష చేశారు. మన గోడౌన్స్‌తో పాటు ఎఫ్‌సీఐ గోడౌన్స్ కూడా తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. 120 కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించాలని సీఎం చెప్పారు. 2020-2021 ఏడాదిలో మిషన్ గోడౌన్స్ ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఇప్పటికే రూ. 321 కోట్లు కేటాయిస్తూ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు.
గోడౌన్స్ కోసం స్థలాలు చూడాలని జిల్లా కలెక్టర్లకి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అరటికి గిట్టుబాటు ధర రూ. 800 రూపాయలు ప్రకటించామని, ధర అధికంగా ఉంది కాబట్టి ఇబ్బంది లేదన్నారు. ఒకవేళ తగ్గితే తన ఆదేశాల కోసం వేచి చూడకుండా కొనుగోలు చేయాలన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ ఒత్తిడికి గురికావడం వల్ల మొక్కజొన్న ధర తగ్గి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న చివరి భూములకు నీరు ఇవ్వడానికి సీలేరు నుంచి నీటి విడుదలకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఏడాది అన్ని రైతు భరోసా కేంద్రాల్లో వేరు శనగ విత్తనాల సరఫరా చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, అధికారులు పాల్లొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment