45 శాతం ఓట్లు జగన్‌కే | Ys jagan mohan reddy sweeps 45% votes next Assembly, lok sabha elections | Sakshi
Sakshi News home page

45 శాతం ఓట్లు జగన్‌కే

Published Wed, Mar 5 2014 4:31 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

45 శాతం ఓట్లు జగన్‌కే - Sakshi

45 శాతం ఓట్లు జగన్‌కే

వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా వీయనుంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 45 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలువనుందని సీఎన్‌ఎన్ ఐబీఎన్-లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాల్లో వెల్లడైంది.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే హవా
సీఎన్‌ఎన్ ఐబీఎన్-లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వే
తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం
కాంగ్రెస్‌కు రెండు ప్రాంతాల్లోనూ భంగపాటే

 
 సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా వీయనుంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 45 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలువనుందని సీఎన్‌ఎన్ ఐబీఎన్-లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాల్లో వెల్లడైంది. సీమాంధ్రలో లోక్‌సభ స్థానాలతో పాటు, అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని సర్వే తెలిపింది. మంగళవారం ఈ సర్వే ఫలితాలను ప్రసారం చేయగా, రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేసిన ఫిబ్రవరి 17 - 23 తేదీల మధ్య ఈ సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం..
     లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో 45 శాతం ఓట్లు సాధిస్తుంది. టీడీపీకి 33 శాతం, కాంగ్రెస్‌కు 16 శాతం ఓట్లు వస్తారుు. బీజేపీ, ఇతర పార్టీలు 3 శాతం ఓట్లు రాబట్టుకుంటారుు.
     అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 45 శాతం, టీడీపీకి 39 శాతం, కాంగ్రెస్‌కు 12 శాతం, బీజేపీకి ఒక శాతం ఓట్లు లభించనున్నాయి. తెలంగాణకు వచ్చేసరికి టీఆర్‌ఎస్‌కు 42 శాతం, కాంగ్రెస్‌కు 20 శాతం, టీడీపీకి 11 శాతం, బీజేపీకి 6 శాతం ఓట్లు రానున్నాయి.
     వైఎస్సార్ కాంగ్రెస్ 11 నుంచి 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నారుు.
     టీడీపీకి10-16 స్థానాలు, టీఆర్‌ఎస్ 6-12, కాంగ్రెస్ 6-12, ఇతరులకు 1-5 స్థానాలు రానున్నాయి.
     వైఎస్సార్ కాంగ్రెస్‌కు, టీడీపీకి మధ్య 12 శాతం ఓట్ల వ్యత్యాసం (లోక్‌సభ) ఉండగా.. సీట్ల సంఖ్యకు వచ్చేసరికి రెండుపార్టీల మధ్య ఒకే ఒక్క సీటు తేడా ఉన్నట్లు సర్వే ఫలితాలు వెల్లడించడం విశ్లేషకులను విస్మయపరిచింది.
     ఒకటీ రెండు శాతం ఓట్ల వ్యత్యాసంతోనే సీట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం కనిపించడం సాధారణం. అలాంటిది 12 శాతం ఓట్ల వ్యత్యాసం ఉంటే సీట్ల సంఖ్యలోనూ వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మధ్య చాలా వ్యత్యాసమే ఉండాలి.
     శాంపిల్ సర్వేకు తీసుకున్నది కూడా దేశవ్యాప్తంగా 512 ప్రాంతాల్లో 9,104 మందిని మాత్రమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement