కర్నూలు, న్యూస్‌లైన్: విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసినా.. మద్యం ఏరులై పారించినా.. ఓటమి ఖాయమని తేలిపోవడంతో టీడీపీ నేతలు బరితెగించారు. పలుచోట్ల కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, ఏజెంట్లపై దాడులకు పాల్పడటంతో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్‌కు ముందు రోజే సాయుధ బలగాలు, స్ట్రైకింగ్ ఫోర్స్, షాడో పార్టీలు రంగంలోకి దిగినా సమస్యాత్మక కేంద్రాల్లో ఘర్షణలను నిలువరించలేకపోవడం గమనార్హం. అయితే హింసాత్మక ఘటనలు, రీపోలింగ్ పరిస్థితులు లేకపోవడంతో పోలీసు శాఖ ఊపిరిపీల్చుకుంది.
ఆళ్లగడ్డలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీడీపీ అభ్యర్థి గంగుల ప్రభాకర్‌రెడ్డి అనుచరులు బూతుల్లోకి చొచ్చుకెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అడ్డుకోవడంతో సాయంత్రం 4.30 గంటల సమయంలో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుస్టేషన్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు గంటకు పైగా ధర్నా చేశారు. పార్టీ నంద్యాల అభ్యర్థి భూమా నాగిరెడ్డి సాయంత్రం స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసు తీరుపై మండిపడ్డారు. అనంతరం డీఎస్పీతో చర్చించారు.
నంద్యాల టౌన్‌హాలులో టీడీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి బావమరుదులు జగదీశ్వరరెడ్డి, ఆదిరెడ్డిల ఆధ్వర్యంలో దొంగ ఓట్లు వేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతతో గంట పోలింగ్ నిలిచిపోయింది. డీఎస్పీ అమర్‌నాథ్‌నాయుడు వారిని శాంతింపజేశారు.
ప్యాపిలి మండలం రంగాపురంలో వైఎస్సార్సీపీ ఏజెంట్ శ్రీనివాసులుపై టీడీపీ ఏజెంట్లు దాడి చేసి గాయపరిచారు.
బనగానపల్లె నియోజకవర్గంలోని అవుకు మండలం రామాపురంలో టీడీపీ వర్గీయులు చెలరేగిపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు డాక్టర్ రాజు, డానియేల్, నాగార్జున తదితరులపై రాళ్లతో దాడి చేశారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్లు పడుతున్నాయనే అనుమానంతో ఈ దాడి చోటు చేసుకుంది.
బనగానపల్లెలోని ప్రభుత్వ పాఠశాల వద్ద జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో సాయంత్రం 3 గంటల నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి, టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్‌రెడ్డిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి హల్‌చల్ సృష్టించారు. రాంపురం, కాశాపురంలో ఏజెంట్లు దొరక్కపోవడంతో ఎమ్మిగనూరులో నివాసముంటున్న కూతురు, భార్యను రాంపురంలోను, మరదలుతో పాటు న్యాయవాదిని కాశాపురంలో ఏజెంట్లుగా కూర్చోబెట్టేందుకు పీఓలపై ఒత్తిడి తీసుకొచ్చారు. స్థానికేతరులు ఏజెంట్లుగా ఉండటానికి వీల్లేదంటూ అధికారులు అడ్డు చెప్పినప్పటికీ అధికారులపై దౌర్జన్యానికి దిగడం గమనార్హం.
కర్నూలులోని సిల్వర్‌జూబ్లీ పోలింగ్ కేంద్రం వద్ద మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అనుచరుడు, మాజీ కార్పొరేటర్ బాలరాజు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. వైఎస్సార్సీపీ మద్దతుదారుడు రాధాకృష్ణపై తన అనుచరులతో కలసి దాడి చేశారు.
దౌర్జన్యకాండ
Published Thu, May 8 2014 3:16 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement