
వైఎస్ జగన్ కచ్చితంగా సీఎం అవుతారు
అమరావతి: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కచ్చితంగా సీఎం అవుతారని ఆ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ సీఎం కావాలనుకోవడం తప్పా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ రాజకీయ వ్యభిచారులని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. అధికారం, మంత్రి పదవి, డబ్బుల కోసమే వారు వైఎస్ఆర్ సీపీని వీడి టీడీపీలో చేరారని అన్నారు. ఈ ముగ్గురికి ఏమాత్రం నైతికత లేదని, నైతికత ఉంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేవారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ దయాదాక్షిణ్యాలపై గెలిచి, ఇప్పుడు ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రూపాయల చిల్లర కోసం ఆయనపై విమర్శలు చేయడం దారుణమని అన్నారు. రాజకీయ వ్యభిచారులను అసెంబ్లీలో మాట్లాడించి ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నీచ సంస్కృతికి తెరలేపారని విమర్శించారు.