
విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్ కు లేఖ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్కు లేఖ రాశారు. స్పీకర్ తనకున్న విశేష అధికారాల మేరకు విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని ఆమె తన లేఖలో కోరారు. అసెంబ్లీ నిబంధనలు 359,360, 361 ప్రకారం బిల్లుపై ఓటింగ్ కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. విభజన బిల్లును సభలో ప్రవేశపెట్టిన మీరే....దానిపై ఓటింగ్ కూడా నిర్వహించాలంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నేరుగా స్పీకర్కు లేఖ అందించారు.