- విజయమ్మకు అడుగడుగునా నీరాజనం
- కదలివచ్చిన అభిమాన తరంగం
- విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
- ఆకట్టుకున్న షర్మిల ప్రసంగం
జన కడలి పొంగింది.. ప్రేమాభిమానాలతో పోటెత్తింది.. తమతో ఆత్మీయతను పంచుకునేందుకు, తమ భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు తరలివచ్చిన మహానేత సతీమణి విజయమ్మకు నీరాజనమెత్తింది. మండు వేసవిలో మంచు పూల వానలాంటి మాతృమూర్తి మాటలతో పులకించినజన కోటి ‘మీ వెంటే ఉంటా’మంటూ నినదించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం మధ్యాహ్నం విశాఖ లోక్‌సభకు ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల సందడి గురువారం హోరెత్తిం ది. నామినేషన్ల ఘట్టానికి ఇంకా ఒక రోజు మాత్రమే గడువుంది. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సెలవు రోజు కావడంతో నామినేషన్లు స్వీకరించరు. కేవలం శనివారం మా త్రమే గడువుంది. దీంతో గురువారం భారీ గా అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు స్వ తంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. విశాఖ పార్లమెంట్ నియోజక వర్గానికి ఆరుగురు, అనకాపల్లికి ఇద్దరు, అరకుకు ఆరుగురు నామినేషన్లు వేశారు. 15 అసెం బ్లీ నియోజక వర్గాలకు 54 మంది 85 నామినేషన్లు సమర్పించారు.
అట్టహాసంగా విజయమ్మ నామినేషన్
వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయలక్ష్మి(విజయమ్మ) విశాఖపార్లమెం ట్ నియోజక వర్గానికి రెండు సెట్ల నామినే షన్లన్లు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌కు సమర్పిం చారు. జగదాంబ జంక్షన్ నుంచి ర్యాలీకి వచ్చిన ఆమెకు వేలసంఖ్యలో పార్టీకార్యకర్తలు, అభిమా నులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ప్ర జల కోలాహలం మధ్య కలెక్టరేట్‌కు చేరుకొని నామినేషన్ వేశారు. మానం ఆంజనేయులు(సీపీఐ), కె.రామం(ఆప్), ఆరేటి ఉమా మహేశ్వరరావు(స్వతంత్ర), జె.తారక రామారావు(స్వతం త్ర) నామినేషన్లు వేశారు. అనకాపల్లి లోక్‌సభకు ఎస్.లీలా ప్రసన్నకుమారి (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), తోట అప్పారావు(స్వతంత్ర), అరకు పార్లమెంట్‌కు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, జి.సంధ్యారాణి(టీడీపీ), మిడియం బాబూరావు(సీపీఎం),కిషోర్‌చంద్రదేవ్ (కాంగ్రెస్), రామిరెడ్డి(స్వతంత్ర), కె.బాలుదొర(స్వతంత్ర) నామినేషన్లు దాఖలు చేశారు.
అసెంబ్లీ స్థానాలకు 54 మంది..
విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి బి.రామన్(లోక్‌సత్తా), యలమంచిలి సెగ్మెంట్‌కు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ప్రగడ నాగేశ్వరరావు, డమ్మీగా ప్రగడ భవానీ, పాడేరుకు ఎం.వీర వెంకట వరప్రసాద్(టీడీపీ), ఎస్.లోవరాజు(జై సమైక్యాం ధ్ర), మాడుగులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, డమ్మీగా ఈర్లి అనూరాధ, ఎస్.టి.జి.విజయలక్ష్మి(స్వతంత్ర) నామినేషన్ వేశారు.
పాయకరావుపేటకు వి.కృష్ణ స్వరూప్(దళిత బహుజన పార్టీ), వి.అనిత(టీడీపీ), విశాఖ ఉత్తరానికి భారతి వెంకటేశ్వరి గుంటూరు(కాంగ్రెస్), జి.వి.నరసింహారావు (కాంగ్రెస్) 2, పి.విష్ణుకుమార్‌రాజు(బీజేపీ), జి.వెంకటసుబ్బారావు, గాజువాకకు పి.పద్మ(స్వతంత్ర), జోసెఫ్ స్టాలిన్ అప్పారి, కె.శ్రీలక్ష్మి(స్వతంత్ర) , జె.శ్రీదేవి (లోక్‌సత్తా), గుడివాడ కృష్ణమోహన్ (స్వతంత్ర), పల్లాశ్రీనివాసరావు(టీడీపీ), పల్లా కార్తీక్(టీడీపీ డమ్మీ) నామినేషన్ సమర్పించా రు.
నర్సీపట్నానికి ఎన్.శ్రీనివాసరావు(సీపీఐ), పి.రమేష్(స్వతంత్ర), కె.సూర్యనాగేంద్ర మహేశ్వరరావు(స్వతంత్ర), భీమిలికి సకురు అనిత(స్వతంత్ర), చెన్నాదాస్(కాంగ్రెస్), బి.గోపాలరావు(స్వతంత్ర), చోడవరానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు(టీడీపీ), కె.శంకరరావు(కాంగ్రెస్), విశాఖ దక్షిణానికి ద్రోణంరాజు శ్రీనివాసరావు(కాంగ్రెస్), వాసుపల్లి ఉషారాణి(టీడీపీ డమ్మీ), చింతపల్లి పోతురాజు(జై సమైక్యాంధ్ర పార్టీ), ఇమాం మొహయుద్దీన్ అహ్మద్(స్వతంత్ర), షేక్ బషీర్ అహ్మద్(స్వతంత్ర), చంద్రమౌళి పట్నాయకుని(లోక్‌సత్తా), కె.రామ్‌కుమార్(స్వతంత్ర) నామినేషన్లు వేశారు.
అరకులోయ నియోజక వర్గానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిడారి సర్వేశ్వరరావు, శెట్టి గంగాధరస్వామి(కాంగ్రెస్), పి.రంజిత్‌కుమార్(స్వతంత్ర), మటం మల్లేశ్వరపడాల్(కాంగ్రెస్), విశాఖ తూర్పుకు అవసరాల భగవానులు(ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి), ప్రభాగౌడ్(కాంగ్రెస్), వెలగపూడి రామకృష్ణబాబు(టీడీపీ), వెలగపూడి సుజన (టీడీపీ డమ్మీ), అనకాపల్లికి పీలా గోవింద సత్యనారాయణ(టీడీపీ), సిహెచ్.సతీష్(స్వతంత్ర), వి.నూకరాజు(లోక్‌సత్తా), సూరిశెట్టి నానాజీ(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), కె.సురేష్(స్వతంత్ర), కె.సన్యాసిరావు(స్వతంత్ర), కె.శ్రీనివాసరావు(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు.