
సాక్షి, పులివెందుల రూరల్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన లెటర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కారు డ్రైవర్ ప్రసాద్ భార్య కృప చెప్పారు. శనివారం వివేకా నివాసం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. వివేకానందరెడ్డి తమ కుటుంబానికి ఎంతో సహాయం చేశారన్నారు. అలాంటి వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
గురువారం రాత్రి 11.45 గంటలకు తన భర్త ఇంటికొచ్చారని చెప్పారు. శుక్రవారం ఉదయం వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు ఫోన్ చేసి సార్‌కు బాగాలేదు.. ఇంటి దగ్గరకు వెళ్లాలని చెప్పడంతో వెంటనే వెళ్లాడని ఆమె తెలిపారు. అంతేతప్ప.. లెటర్‌కు, తన భర్తకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
సంబంధిత కథనాలు
హత్య చేస్తుంటే ఎవరైనా లెటర్ రాస్తారా?
Comments
Please login to add a commentAdd a comment