'ప్రజలు..వైఎస్ జగన్ సీఎం కావాలనుకుంటున్నారు' | YSR Congress party MLA Narayana swamy prayers at Tirumala | Sakshi
Sakshi News home page

'ప్రజలు..వైఎస్ జగన్ సీఎం కావాలనుకుంటున్నారు'

Published Fri, Nov 14 2014 11:08 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

'ప్రజలు..వైఎస్ జగన్ సీఎం కావాలనుకుంటున్నారు' - Sakshi

'ప్రజలు..వైఎస్ జగన్ సీఎం కావాలనుకుంటున్నారు'

తిరుపతి: భవిష్యత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే నారాయణ స్వామి తెలిపారు. శుక్రవారం తిరుమలలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం నారాయణ స్వామి విలేకర్లతో మాట్లాడుతూ ...  సీఎం చంద్రబాబు తన అబద్దపు హామీలతో ప్రజలను మోసగించారని ఆరోపించారు.

చంద్రబాబు ఐదునెలల పాలనతో పేద ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు నారాయణ స్వామి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement