ఈ నెల 7వ తేదీన జరుగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనరాదని వైఎస్సార్ కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలకు విప్‌ను జారీ చేసింది.
హైదరాబాద్: ఈ నెల 7వ తేదీన జరుగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనరాదని వైఎస్సార్ కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలకు విప్‌ను జారీ చేసింది. పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ మేరకు ఎమ్మెల్యేలందరికి విప్‌ను ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సినంత సంఖ్యాబలం లేదు కనుక తాము ఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని పార్టీ ఇది వరకే ప్రకటించింది. బాలినేని జారీ చేసిన విప్‌లో కూడా రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనరాదనేది పార్టీ విధానం కనుక పోలింగ్‌కు దూరంగా ఉండాలని ఆయన ఎమ్మెల్యేలను కోరారు.