
గెయిల్ దుర్ఘటన బాధితులకు వైఎస్ఆర్ సీపీ సాయం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా నగరం గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలిన దుర్ఘటన బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సాయం అందజేసింది. మృతుల కుటుంబ సభ్యులకు లక్ష రూపాయిల ఎక్స్గ్రేసియా, గాయిపడినవారికి 25 వేల రూపాయిల చొప్పున వైఎస్ఆర్ సీపీ సాయం చేసింది.
నాణ్యత లోపం వల్లే నగరం ప్రమాదం జరిగిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పైపులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద బాధితులకు అండగా ఉంటామని జ్యోతుల నెహ్రూ చెప్పారు.