వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అధిక ప్రాధాన్యం | ysrcp gives most preference for SC, ST, minorities | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అధిక ప్రాధాన్యం

Published Wed, Aug 27 2014 4:37 PM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అధిక ప్రాధాన్యం - Sakshi

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అధిక ప్రాధాన్యం

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరు శాసనసభ్యులకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న అధికార పార్టీ నాయకుల ఆరోపణలను ఆ పార్టీ ఎమ్మెల్యే రాజన్న దొర ఖండించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలతో కలసి రాజన్న దొర విలేకరులతో మాట్లాడారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గిరిజనులు, మైనార్టీలు, ఎస్సీలు అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని రాజన్న దొర చెప్పారు. బలహీన వర్గాల నుంచి తమ పార్టీ తరపునే అత్యధికమంది చట్ట సభలకు ఎన్నికయ్యారని అన్నారు. శాసనసభలో పలు సమస్యల గురించి చర్చించాల్సిన అవసరముందని, తాను కూడా మాట్లాడుతానని రాజన్న దొర చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement