
వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్య
విజయనగరం : వైఎస్సార్‌సీపీ నేత దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన విజయనగరం జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విజయనగరానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత రేగాళ్ల సన్యాసిరావు ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాపు కాసి హతమార్చారు. దుండగులు తలపై బలంగా కర్రలతో మోదడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.