ఆంధ్రావని నడి వీధుల్లో ప్రజాస్వామ్యం ఖూనీ | YSRCP Leaders Protests over TDP act towards Bus accident | Sakshi
Sakshi News home page

ఆంధ్రావని నడి వీధుల్లో ప్రజాస్వామ్యం ఖూనీ

Published Fri, Mar 3 2017 2:21 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

ఆంధ్రావని నడి వీధుల్లో ప్రజాస్వామ్యం ఖూనీ - Sakshi

ఆంధ్రావని నడి వీధుల్లో ప్రజాస్వామ్యం ఖూనీ

సాక్షి నెట్‌వర్క్‌
అత్యంత దుర్మార్గం.. హేయం..
ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తే సహించలేకపోతోంది.
బాధ్యతను గుర్తుచేస్తే భరించలేకపోతోంది.
బాధితులను ఆదుకోమని అడిగితే కోపగిస్తోంది.
ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు నడివీధిలో ఖూనీ చేయడానికి  వెనుకాడడం లేదు.


కృష్ణాజిల్లా బస్సుప్రమాద ఘటనలో అధికారులు చేస్తున్న పొరపాట్లను అడ్డుకోబోయిన ప్రతిపక్షనేతపై కేసు మోపారు... అదేం అన్యాయమంటూ రాష్ట్రమంతా నిరసన ప్రదర్శనలు చేస్తుంటే ఉక్కుపాదంతో అణచేశారు. విజయవాడలో మాజీ శాసనసభ్యుడు, నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ను,  మిగిలిన నాయకులను అక్రమంగా అదుపులోకి తీసుకుని రోజంతా విజయవాడకు దూరంగా ఓ పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. అసలు అక్కడ ధర్నా ప్రారంభం కాలేదు. ఉద్రిక్తత లేదు. కానీ పోలీసులు మాత్రం కక్షగట్టినట్లు నేతలను అక్రమంగా నిర్బంధించారు.

ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలియదు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు. చివరకు వెల్లంపల్లి ఎస్‌ఐపై దౌర్జన్యం చేశారంటూ ఓ తప్పుడు కేసు పెట్టారు. గురువారం రాష్ట్రవ్యాపితంగా ధర్నాలు, రాస్తారోకోలు చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలపై జులుం ప్రదర్శించారు. ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగి అనేకమంది చనిపోయినపుడు బాధితులకు న్యాయం జరగాలని, దోషులకు శిక్ష పడాలని ఎవరైనా ఆశిస్తారు. ప్రభుత్వం ఆదుకోవాలని, అధికారులు సరిగా వ్యవహరించాలని ఆకాంక్షిస్తారు.. కానీ దోషులను రక్షించేలా, బాధితులకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తుంటే.. అదేమిటంటూ నిలదీసిన ప్రతిపక్షనేతపైనే కేసు నమోదు చేయడం, దానికి నిరసన తెలుపుతూ ప్రజలు ప్రదర్శనలకు దిగితే అణచివేయాలని చూడడం టీడీపీ ప్రభుత్వ హద్దులు లేని అసహనానికి నిదర్శనమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


విజయవాడలో వైఎస్సార్సీపీ నేతల అక్రమనిర్బంధం
విజయవాడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గురువారం స్థానిక ధర్నా చౌక్‌లో  నిర్వహించిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు.  ధర్నా ప్రారంభానికి ముందే నాయకులను అరెస్టుచేసి బలవంతంగా ఓ మినీ లారీలోకి ఎక్కించారు. టాప్‌లేని, కూర్చోవడానికి వీలులేని లారీలో ఎండలోనే సుమారు 60కి.మీ దూరంలో ఉన్న ఉంగుటూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసినవారిలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్, రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి తదితరులున్నారు. వారిని కృష్ణాజిల్లా ఉంగుటూరు స్టేషన్‌కు తరలించారు. ఉదయం 11  నుంచి రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉంచి వేధించారు.

పై అధికారుల ఆదేశాల మేరకే ఇక్కడకు తీసుకువచ్చారని, తమ స్టేషన్‌లో ఉంచుకోవడం తప్ప తమకు ఇతర సమాచారం తెలియదంటూ ఉంగుటూరు  పోలీసులు పేర్కొన్నారు. అక్రమంగా నిర్బంధించడంపై పోలీసుస్టేషన్‌ వద్ద  ధర్నాకు దిగేందుకు సిద్దం కాగా, రాత్రి 10.45గంటలకు విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి విడిచిపెట్టారు. కాగా, ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన వత్తిడి మేరకు.. ఉంగుటూరు పోలీసుస్టేషన్‌లో ఉన్న నాయకుల్లోంచి  వెల్లంపల్లి శ్రీనివాస్‌ను వేరు చేసి ఆయనపై నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లలతో కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు.

వెల్లంపల్లి మినహా మిగిలిన నేతలు వెళ్లిపోవచ్చని సూచించారు. పోలీసుల ఎత్తుగడను ముందుగానే ఊహించిన పార్టీ నేతలు ఒక్కరిపైనే కేసు నమోదు చేస్తామంటే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. దీంతో తప్పని పరిస్థితుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్‌తో సహా అందరు నేతల్ని రాత్రికి విజయవాడ తీసుకువచ్చారు.  ఎస్‌ఐ విధులు నిర్వహించకుండా ఆటంకపరచడమే కాకుండా ఎస్‌ఐపై దౌర్జన్యం చే శారంటూ వెల్లంపలిపై ఐపీసీ 353  సెక్షన్‌ క్రింద కేసు నమోదు చేసి స్టేషన్‌ బెయిల్‌ పై వదిలిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement