ఎన్టీఆర్పై చెప్పులేయించి, మైక్ ఇవ్వకుండా... | ysrcp mla roja slams telugudesam party | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్పై చెప్పులేయించి, మైక్ ఇవ్వకుండా...

Published Thu, Aug 28 2014 10:31 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

ఎన్టీఆర్పై చెప్పులేయించి, మైక్ ఇవ్వకుండా... - Sakshi

ఎన్టీఆర్పై చెప్పులేయించి, మైక్ ఇవ్వకుండా...

హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో సభా సంప్రదాయాలు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ మీద చెప్పులు వేయడం, ఆయనకు మైకులు ఇవ్వకుండా ఆనాడు స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడు... ఈరోజు తమకు నీతులు చెబుతున్నారని రోజా ఎద్దేవా చేశారు.  ఆమె గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లుతో మాట్లాడుతూ సభ నిర్వహణ తీరు సక్రమంగా లేదని  ఆక్షేపించారు.

ఎన్నికల్లో హామీ ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ చర్చ కోరితే అంగీకరించలేదని మైక్ ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ మహిళా ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడికి మైక్ కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, మరోవైపు టీవీ ఛానల్స్ చర్చల్లో పాల్గొని జగన్ గారు వారి గురించి ప్రస్తావించలేదు, వీరి సమస్యల గురించి చర్చించలేదని విమర్శించటం సిగ్గుచేటు అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్పై చర్చించటం లేదంటూ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడం వల్ల ఆ గ్రూప్‌ల సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. ఈ సమస్యపై చర్చించేందుకు ప్రయత్నించిన మహిళా ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వకుండా వారి గొంతు నొక్కేందుకు ప్రయత్నించారన్నారు. డ్వాక్రా మహిళలు రుణాల కోసం  బ్యాంకులకు వెళితే వారిని దొంగల్లా చూస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అణా పైసలతో సహా రుణమాఫీ చేస్తామన్నారని...అయితే అధికారంలోకి వచ్చాక మాత్రం రుణమాఫీపై బడ్జెట్లో ప్రస్తావనే లేకుండా పోయిందన్నారు. ఓటు అనే చుక్క వేలు మీద పడి అధికారంలోకి వచ్చాక మాటలు మారుస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement