దెందులూరు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమ కేసులు పెడితే భయపడేది లేదని దీటుగా ఎదుర్కొంటామని వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ స్పష్టం చేశారు. శనివారం ఏలూరు పార్టీ క్యాంపు కార్యాలయంలో దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు ఆళ్ల నాని, కోటగిరిని కలిశారు.
ఇటీవల పెదవేగి మండలం సూర్యారావుపేటలో జరిగిన సంఘటనపై వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాని, కోటగిరి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ఇసుక, గ్రావెల్ దోపిడీ జరుగుతుందన్నారు. అధికారులు సైతం ప్రభుత్వ సంపద కళ్లెదుటే దోచుకుపోతున్నా పట్టనట్టు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తే భయపడకుండా ఎదుర్కొంటామన్నారు.
ఎమ్మెల్సీ నాని, కోటగిరిని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్మ శివరామకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీ కామిరెడ్డి నాని, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు ఎం సూర్యనారాయణ, ఏలూరు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండేటి గంగాధరరావు బాబు, జిల్లా కమిటీ సభ్యులు యలమర్తి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి తోట పద్మారావు, దెందులూరు నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు తొత్తడి వేదకుమారి, దెందులూరు నియోజకవర్గ బీసీ విభాగం అ«ధ్యక్షులు మేకా లక్ష్మణరావు, తాతా సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ ఏలూరు రూరల్ మండల అధ్యక్షులు తేరా ఆనంద్, మొండెం ఆనంద్, మొరవనేని భాస్కరరావు, పర్వతనేని నాగయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment