
శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువుపుష్య మాసం, తిథి బ.చతుర్దశి రా.2.04 వరకు, తదుపరి అమావాస్య నక్షత్రం పూర్వాషాఢ రా.1.30 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం ఉ.10.50 నుంచి 12.28 వరకు, దుర్ముహూర్తం ఉ.10.19 నుంచి 11.04 వరకు, తదుపరి ప.2.46 నుంచి 3.31 వరకు అమృతఘడియలు... రా.8.37 నుంచి 10.14 వరకు.
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.46
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
భవిష్యం
మేషం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులలో ప్రతిబంధకాలు. ఉద్యోగయత్నాలు కొంత మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృషభం: ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ఆటంకాలు. కొత్తగా రుణాలు చేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
మిథునం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. స్తిరాస్థి వృద్ధి. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
సింహం: వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. బంధువులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కన్య: బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు ,సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
వృశ్చికం: కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో అకారణంగా వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
ధనుస్సు: పురస్కారాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
మకరం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గంతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు కాస్త ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
కుంభం: శ్రమ ఫలిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
మీనం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అంచనాలు నిజమవుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment