
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం ప్రాధాన్యత కనబరుస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. హెల్త్ వెల్‌నెస్ సెంటర్ల కోసం రూ. 1200 కోట్లు కేటాయించారు. పేదలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని, 10 కోట్ల కుటుంబాలకు దీన్ని వర్తింపచేస్తామని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ చెప్పారు.
ప్రపంచంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమంగా ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి అభివర్ణించారు. ఆయుష్మాన్‌భవ సహా పలు ఆరోగ్య కార్యక్రమాలు, పథకాలను పరిపుష్టం చేస్తామని చెప్పారు. ఆరోగ్య రక్షణ పథకాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, కానీ కావాల్సిన స్థాయిలో ఆరోగ్య సంరక్షణ అందించాలని తాము కోరుకుంటున్నట్టు జైట్లీ చెప్పారు.
అంతేకాక 1.5 లక్షల ఆరోగ్య సంరక్షణ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు కూడా చెప్పారు. ఇవి ప్రతి ఒక్క గృహదారుడికి దగ్గరగా ఉంటాయని, ఈ సెంటర్లు ప్రజలకు అవసరమైన డ్రగ్స్‌ను, డయాగ్నోసిస్‌ను ఉచితంగా అందించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు హెల్త్ కవర్ అందుబాటులో ఉండే పథకం కెనడా దేశంలో అవలంభవుతోంది. ప్రస్తుతం మనదేశం కూడా ప్రజలకు మెడికల్ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు నిర్ణయించింది.
మెడికల్ ఇన్సూరెన్స్‌తో పాటు కొత్తగా 24 మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత కాలేజీలను కూడా ఆధునీకరించనున్నట్టు తెలిపారు. దీంతో దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా చూసుకోనున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యంపై కూడా ఈ సారి ప్రభుత్వం ఈసారి ఎక్కువగా దృష్టిసారించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment